calender_icon.png 11 August, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి నా దేయం

10-08-2025 10:27:25 PM

ఎల్లారెడ్డి అభివృద్ధికి కట్టుబడి ఉంటాను

ప్రభుత్వ ఫలాలను పేదలకు దరిచేరేంతవరకు నిద్రపోను

 ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

గాంధారి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. ఈ మేరకు ఆదివారం రోజున గాంధారి మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా గండివేట్ గ్రామంలో ప్రజల యొక్క సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఐమాక్స్ లైటును ఎమ్మెల్యే తన చేతుల మీదుగా ప్రారంభించారు. అదేవిధంగా గండివేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరై ఆ ఇంటి నిర్మాణం జరుగుతున్న తీరును ఆయన దగ్గరుండి పరిశీలించారు. అనంతరం ఆ లబ్ధిదారులతో మాట్లాడి వారి యొక్క అభిప్రాయాలను సేకరించారు.

మాకు ఇల్లు మంజూరు చేసి, మా కుటుంబ సొంత ఇంటి కలను నెరవేర్చిన ఎమ్మెల్యే మదన్ మోహన్, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్  రావు మాట్లాడుతూ... నియోజకవర్గవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని బిల్లులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని లబ్ధిదారులకు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని మాట మీద కట్టుబడి ఉంటుందని ఆయన అన్నారు.

ఇందుకోసం గ్రామ పంచాయతీ సెక్రటరీలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పనుల పురోగతిపై నివేదికలు తెప్పించుకుంటున్నానని అని  అన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో పేద ప్రజల సొంత ఇంటి కల సాకారం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమని మండలానికి మరిన్ని ఇళ్లు మంజూరు కావడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ కృషి  చేస్తానని భరోసా ఇచ్చారు. అదేవిధంగా గండిపేట్ తండాలో గిరిజనులు నిర్వహించే అత్యంత సాంప్రదాయబద్ధమైన తిజ్ పండుగలో పాల్గొని గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపిరు. గిరిజన ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో పెంచిన వరి బుట్టలను ఎమ్మెల్యే తన నెత్తిన పెట్టుకొని వారు  చేసే నృత్యాలలో పాల్గొని వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.