calender_icon.png 11 August, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయిత ప్రకాష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

10-08-2025 10:30:20 PM

మంథని,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిత ప్రకాష్ రెడ్డి తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా,  మంథని నియోజకవర్గంలోని మల్హర్ మండలం వల్లెంకుంట గ్రామంలో ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులను మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ఆదివారం పరామర్శించారు. మృతురాలు చిత్రపటం వద్ద  నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం  కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. చైర్మన్ వెంట నాయకులు పేరవేన లింగయ్య యాదవ్, చంద్రు రాజమల్లు, రాం రాజశేఖర్, తదితరులు ఉన్నారు.