10-08-2025 10:33:44 PM
వేములవాడ టౌన్,(విజయక్రాంతి): శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానా గోశాల సంరక్షణ ట్రస్ట్‌కు సిద్ధిపేట జిల్లా వాసి భక్తుడు వంగ రాజేశ్వర్ రెడ్డి.కుమార్తె ఆర్తి రెడ్డి పేర ఒక లక్ష రూపాయలు విరాళంగా దేవస్థాన ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీకాంత్ చారి అందజేశారు.ఈ కార్యక్రమం కె. సింహాచార్యులు బి.రమాదేవి కూడా ఉన్నారు. గోశాల సంరక్షణార్థం విరాళం అందజేసిన రాజేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులకు నందీశ్వరుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సిబ్బంది ధన్యవాదాలు తెలియజేశారు.