09-12-2025 02:05:32 AM
నిజాంపేట ఎస్.ఐ రాజేష్
నిజాంపేట, డిసెంబర్ 8 : గ్రామ పంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో అభ్యర్థులు ఎన్ని కల ప్రచారాలకు అనుమతులు తీసుకోవాలని ఎస్‌ఐ రాజేష్ సూచించారు. నిజాంపేట లో మాట్లాడుతూ.. రెండు విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు మైక్ ద్వారా ప్రచారం చేయాలనుకునేవారు మీసేవ లో చలాన్ కట్టి, స్థానిక తహసిల్దార్ అనుమతి తీసుకోవాలన్నారు. అనుమతులు లేకుండా ప్రచారం చేస్తే ఎన్నికల నిబంధన మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.