09-01-2026 12:28:17 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), జనవరి 8: జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బొల్లెపల్లి అంజయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. గురువారం కాంగ్రెస్ నాయకులు అంజయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.
నివాళులర్పించిన వారిలో బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నర్సింగ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోరపాక సత్యం, శిగ నసీర్ గౌడ్, సర్పంచ్ బింగి కృష్ణమూర్తి, గ్రామశాఖ అధ్యక్షుడు నర్సింగ కృష్ణమూర్తి, వల్లాల ఖాజా, నాయకులు శ్రీనివాస్, రవీందర్, సత్తయ్య, లింగయ్య, సైదులు, ప్రవీణ్, సందీప్, నరేష్ పాల్గొన్నారు.