calender_icon.png 9 January, 2026 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ కబ్జాలకు కేరాఫ్ బెల్లంపల్లి?

09-01-2026 12:01:37 AM

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి భూ కబ్జాలకు కేరాఫ్‌గా మారిపోయింది. అధికారుల దన్ను, అధికార బలం వెరసి బెల్లంపల్లిలో భూ అక్రమాల దూకుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. భూ కబ్జాలకు కన్నాల ప్రభుత్వ భూములు ప్రధాన అడ్డాగా మారిపోయాయి. కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు అక్రమార్కుల పాలవుతున్నాయి. అధికారం భూ నేరాలుగా పరిణమించాయన్న విమర్శలు ఉన్నాయి. ప్రజా సేవ ముసుగులో భూ కబ్జాలే వారి ప్రజాసేవకు నిర్వచనం అయింది.  

వందల ఎకరాలు మాయం..?

కబ్జమే సవాల్ అంటున్నారూ..

కూల్చిన చోట మళ్లీ నిర్మాణాలు ఎలా..?

అధికార పెద్దల లీలలు..

కన్నాల భూ కబ్జాలకు పుట్ట..

బెల్లంపల్లి, జనవరి 8: కన్నాల శివారులోని 112 సర్వే నంబర్ లో వేల ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని కబ్జాకోరులు కోట్లకు పడిగెత్తుతున్నారు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టడమే వారి ప్రధాన పనిగా మారిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కన్నాల జాతీయ రహదారి ప్రధాన కూడలి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారు. కన్నాల ఫ్లై ఓవర్ రైల్వే బ్రిడ్జి బఫర్ జోన్ పరిధినీ కూడా అక్రమ మార్కులు విడిచి పెట్టడం లేదు. విచిత్రమేమంటే ఈ స్థలంలో కట్టిన అక్రమ నిర్మాణాలను గత  నెల అధికారులే కూల్చివేశారు. అంత వరకూ బాగానే ఉంది. అదే స్థలంలో అదే భూ అక్రమార్కులు  మళ్ళీ నిర్మాణాలకు తెగపడటం గమనార్హం.

అధికారులు అక్రమమని కూల్చిన చోటనే నిర్భయంగా మళ్ళీ అక్రమ కట్టడాలు మొదలు పెట్టారు. అంతే కాకుండా ఆక్రమిత భూమీలో ఈ సారి ఏకంగా బోర్ పంపు వేశారు. ఇదెక్కడి చోద్యమని ఆద్యంతం ఆశ్చర్యపోతున్నారు. భూకబ్జా దారులు ఎంతకైనా తెగిస్తారనే విషయం మరో సారి రూడీ అయింది. అధికారుల అండ లేకపోతే ఒక సారి కూల్చివేతకు గురైనా స్థలంలో మరోసారి నిర్మాణాలకు అవకాశం ఎలా ఉంటుందని అందరూ చర్చిం చుకుంటున్నారు.

అధికార యంత్రాంగం సపో ర్టు లేకుండా ఇలా జరుగదనేది స్పష్టం అవుతున్నది. ఇది ఎవరూ కాదలేనీ సత్యం. కూల్చి వేసిన అధికారులే అక్రమార్కుల అంటకాగితే ఏదైనా సాధ్యమే అవుతుంది. అందుకే దర్జాగా మళ్లీ అక్రమ నిర్మాణ పనులకు దిగడంలోని ఆంతర్యం ఇట్టే తేటాతెల్లం చేస్తుంది. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ఇదే క్రమంలో రాజకీయ పలుకుబడి ముందు అధికారులు తలవంచని పరిస్థితి కూడా లేకపోలేదు.

కన్నాల భూములకు కన్నం..?

మండలంలోని కన్నాల శివారు ప్రభుత్వ భూములు బెల్లం, పల్లీలుగా మరిపోయాయి. అలవోకగా చేతులు మారుతున్నాయి. ఇప్పటి వరకూ సుమారుగా రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం జరిగినట్టు తెలుస్తున్నది. ఈ దందా పై ఇప్పటికే కన్నాల మాజీ సర్పంచ్  మంద అనిత నేరుగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు కూడా చేశారు. కన్నాల ప్రాంతంలో ఎంత పెద్ద ఎత్తునా భూ అక్రమా లు  జరుగుతున్నాయో ఇంతకంటే సాక్షీభూ తం మరొకటి  అక్కర లేదు. ఈ వ్యవహారం  అధికారులకు తెలియనిధి కాదు.

ఈ భూ అక్రమాలు గత పది సంవత్సరాల క్రితం నుండే జరుగుతున్నాయి. అప్పటి నుండి నేటి వరకు కన్నాల ప్రభుత్వ భూముల కబ్జాల పర్వం సాగుతూనే ఉంది. అప్పుడు, ఇప్పుడూ కబ్జాకోరులు విధితమే. భూములను తెగనమ్మి కోట్ల కు పరిగెత్తుతున్నారు. అధికారం, పలుకుబడి మాటునా ఈ భూ దందా జోరుగా సాగుతూ నే ఉంది. చివరకు కన్నాల శివారులో సెంటు భూమి ప్రభుత్వ ఆధీనంలో లేని పరిస్థితి నెలకొందంటే ఇక్కడ  భూ కబ్జాలు ఏ స్థాయికి చేరాయో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా అడ్డు చెప్పే నాధుడే లేడూ. అంత దమ్మున్న అధికారి ఇక్కడా ఎంత వేతికినా కనిపించడూ.. ఇది బెల్లంపల్లిలో జరుగుతున్న భూకబ్జాల చరిత్ర. భూ కబ్జాదారుల అగడాల కు పరాకాష్ట.

ఈ అవినీతి చరిత్రను తిరిగిరాసే ఘడ్స్ ఉన్న ప్రభుత్వ అధికారే లేడూ. అలాంటి అధికారి ఎవరైనా.. బెల్లంపల్లికి వచ్చేవరకూ ఇక్కడ ఖాళీ ప్రభుత్వ భూములు మిగలవు. ఇప్పటికే ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున చేతులు మారిపోతున్నాయి. ఈ పని  శరవేగంగా జరుగుతున్నదంటే   అతిశయోక్తి కాదు.. చిన్న బుగ్గ గుట్ట, గంగారం నగర్, గొల్ల గూడెం ప్రభుత్వ, ఫారెస్టు భూములను సహితం భూ ఆక్రమణ గ్యాంగులు చేపడుతున్నాయి. ఎన్ని భూ అక్రమాలు జరిగినా అధికారులు తమకేమి తెలియనట్టు నటిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులపై ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని  భరిస్తున్నారే కానీ విధులకు పని చెప్పడం లేదు. భూ కేటుగాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అధికార్లు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారన్న విమర్శలు పెల్లుబికుతున్నాయి.

భూ కబ్జాదారులు రింగ్..?

కన్నాల శివారు ప్రభుత్వ భూముల కబ్జా వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనేది తెలిసిందే.. అందుకు బెల్లంపల్లిలో అడ్డగోలుగా జరుగుతోన్న భూకబ్జాలే సాక్షిభూతం. పార్టీలకతీతంగా భూ కబ్జాదారులంతా కూడబల్కొని భూములను తెగ నమ్ముతున్నారు. ఈ పరిస్థితి గత బీఆర్‌ఎస్ పాలన నుంచే మొదలైంది. పార్టీలు వేరైనా భూ కబ్జాదారులు అందరూ ఒకటే.. అందుకే బెల్లంపల్లిలో ప్రభుత్వ భూ ములకు రక్షణ కరువైంది. ఇక్కడ సాగుతోన్న ప్రభుత్వ భూముల కబ్జాల పర్వంలో అందరికీ వాటాలు ఉన్నాయి. నిరాటకంగా సాగుతున్న ఈ భూ కబ్జాల మర్మంలో దాగివున్న సత్యమిదే.

ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు జోక్యం చేసుకొని కన్నాల భూ అక్రమాలపై విచారణ చేపడితే భూదొంగలంతా బయటపడతారు. ప్రభుత్వ భూముల అక్రమాలు, అవి నీతిని బయటకు తీయాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పైనే ఉన్నది. ఈ ప్రయత్నం ఇప్పటి వరకూ ఎవరూ చేయలేదు. అంతటి సాహసం, నైతిక ధైర్యం అధికారుల్లో కనిపించిన దాఖలు కాన రాకపోవడమే ఈ భూ మాఫియా ఆగడాలకు ఎదురులేకుండా పోయింది. ఇప్పటికైనా..  ఆ ప్రయత్నం జరగాలని.. ఆ రోజు రావాలని ఆశిద్దాం.