09-01-2026 12:28:54 AM
హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): చేతికొచ్చిన పంట భద్రత కోసం ఆధునిక పరిజ్ఞానంతో నిల్వ చేసేందుకు రూట్ మ్యాప్ రూపొందిస్తున్నామని, తద్వారా రైతుకు భరోసా కల్పించడంతో పాటు ఆహార భద్రతను పెంపొందించడం సులభ తరమవుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నా రు. ఉత్పత్తి అయిన ధాన్యాన్ని పరిరక్షంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
గురువారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో భారత ఆహార సంస్థ, రాష్ర్ట పౌర సరఫరాల శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సైలో (బ్యాగుల నివారణ విధానం) పద్ధతిలో బియ్యం, మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటలను నిల్వ చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. మనుషుల జోక్యం లేకుండానే సైలో పద్ధతిలో ఉండే ఇంటిగ్రేటెడ్ క్లీనర్లు, డ్రైయర్లతో రెండు సంవత్సరాల వరకు ధాన్యాన్ని నిలువ ఉంచేందుకు అవకాశం ఉంటుందన్నారు.
ప్రభుత్వం ప్రస్తుతం కొనుగోలు చేసిన ధాన్యాన్ని నేరుగా రైస్ మిల్లులకు పంపడంతో మిల్లింగ్‌లో జరుగుతున్న జాప్యంతో ధాన్యం చెడిపోయి నష్టం వాటిల్లుతుందని, మిల్లులలో శాస్త్రీయ పద్ధతిలో నిల్వ చేసే అవకాశం లేకపోవడంతోటే ఈ నష్టం జరుగుతోందన్నారు. శాస్త్రీయమైన సైలో పద్ధతిని అమలులోకి తేవాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టామన్నారు. తద్వారా ధాన్యం దీర్ఘకాలికంగా పరిరక్షంచుకోవచ్చని, పాత బియ్యానికి మార్కెట్‌లో అధిక ధర లభిస్తుందన్నారు.
రాష్ర్ట ప్రభుత్వం అమలులోకి తేవలనుకుంటున్న సైలో ప్రాజెక్టుతో పెద్ద ఎత్తున ప్రయోజనం ఉండే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. కేంద్రం కొనుగోలు చేయాల్సిన ధాన్యాన్ని రాష్ర్ట ప్రభుత్వం మీదకు నెట్టేసి మిల్లింగ్ అయిన బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేయడంతో కొనుగోలుకు మిల్లింగ్‌కు మధ్యన రాష్ర్ట ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.5 వేల కోట్లు నష్ట పోతుందన్నారు. సైలో పద్ధతిని అమలులోకి తీసుకొస్తే రూ.5 వేల కోట్ల భారం అధిగమించడంతో పాటు రూ.వెయ్యి కోట్లు రాష్ర్ట ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు.