02-05-2025 12:56:16 AM
దాడి చేసినంత మాత్రాన మీకు విజయం దక్కినట్టు కాదు
పహల్గాం దాడిపై హోంమంత్రి అమిత్‌షా
న్యూఢిల్లీ, మే 1: ‘పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఒక్కొక్కరిని ఎక్కడున్నా వెతికి పట్టుకుని ప్రతీ కారం తీర్చుకుంటాం (చున్‌చున్ కే బద్‌లా లేంగే). ఉగ్రమూకలకు తగిన సమాధానం చెబుతాం. ఉగ్రవాదు లు.. ఇది మోదీ ప్రభుత్వం అనే విష యం గుర్తుంచుకోవాలి’.
అని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఉగ్రవాదులను తీవ్రంగా హెచ్చరించారు. గురు వారం న్యూఢిల్లీలో జరిగిన ఓ బహిరంగ సభలో షా మాట్లాడారు. పహ ల్గాం ఉగ్రదాడి అనంతరం అమిత్‌షా బహిరంగంగా మాట్లాడటం ఇదే మొదటిసారి. ‘పిరికిపందల్లా దాడులు చేసి విజయం సాధించామని టెర్రరిస్టులు అనుకోవద్దు. ఈ పోరు ఇంకా అయిపోలేదు. ఇది నరేంద్ర మోదీ ప్రభు త్వం అనే విషయాన్ని ఉగ్రవాదులు గుర్తుంచుకోవాలి.
దేశంలోని ఏ ఒక్క అంగుళంలో ఉగ్రవాదం లేకుండా అంతం చేయాలనేది మా సంకల్పం. అది సాధించి తీరుతాం. ఉగ్రవాదంపై పోరులో 140 కోట్ల మంది భారతీయులే కాదు.. మొత్తం ప్రపంచమే భారత్ వెనుక ఉంది. పహల్గాం ఉగ్రదాడి నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం. ఉగ్రవాదం నశించేదాక మా పోరు కొనసాగుతూనే ఉంటుంది. ఉగ్రమూకలకు కచ్చితంగా తగిన శిక్ష విధించబడుతుంది’. అని షా పేర్కొన్నారు.