27-06-2025 12:00:00 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): జూరాల ప్రాజెక్టు పరిధిలోని తొమ్మిదో నంబర్ గేట్ రోప్ తెగిపోవడం కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ‘ఎక్స్’ ద్వారా పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి ప్రాజెక్టులపై ఏమాత్రం అవగాహన లేదని, ఆ కారణంతోనే జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో పడిందన్నారు.
యేటా వానకాలంలో ప్రాజెక్ట్ వరద ఉధృతిని ఎదుర్కొంటుందని తెలిసినా, ప్రభుత్వం స్పిల్ వే మెయింటెనెన్స్ పనులు చేయించడంలో నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడాలని, జూరా ల ప్రాజెక్ట్‌తో పాటు ఇతర ప్రాజెక్ట్‌ల పరిధిలో మరమ్మతులు చేపట్టాలని సూచిం చారు. వానాకాలం కాబట్టి ముంపు, దిగువ ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని విజ్ఞప్తి చేశారు.