01-10-2025 12:00:00 AM
మణుగూరు, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): పీకే ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ పెద్దమల్ల వీరభద్రరావు బాధ్యతలు చేపట్టారు. మంగళవారం తన కార్యాలయంలో బాధ్యతలు తీసుకోగా పలువురు ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కొండాపురం భూ గర్భగని ప్రాజెక్ట్ ఆఫీసర్ విధులను నిర్వహించిన ఇటీవలే ఉద్యోగ ఉన్నతి పై ప్రాజెక్ట్ అధికారిగా నియమించబడ్డారు.
ఈ సందర్భంగా వీరభద్ర రావు మాట్లాడుతూ.. సింగ రేణి 11 ఏరియాలలో అతిపెద్ద ఉపరితల గని ప్రాజెక్ట్ అధికా రిగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. రక్షణతోకూడిన ఉత్పత్తి, కోసం అధికారుల సహకారంతో ముందుకు సాగుతామన్నారు. బొగ్గు ఉత్పత్తిలో ప్రాజెక్టును అగ్రస్థానం లో నిలిపేందు కు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.