01-10-2025 12:00:00 AM
బూర్గంపాడు,సెప్టెంబర్ 30(విజయక్రాంతి): భద్రాచలం వద్ద గోదావరి నది మంగళవారం 49.60 అడుగులకు చేరుకోవడంతో బూర్గంపాడు మండల కేంద్రంలో వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో పత్తి, వరి పంటలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతు గంగరాజు యాదవ్ ఆవేదన వ్య క్తం చేశారు. అప్పులు చేసి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నీట మునగడం వల్ల తీవ్ర నష్టం జరిగిందని వాపోయారు.పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు.