18-05-2025 12:55:24 AM
హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): రెండో దశ మెట్రో ప్రాజెక్ట్ డీపీఆర్‌లను పూర్తిస్థాయిలో పంపిస్తే, కేంద్ర ప్రభుత్వం సహకరించేందుకు సిద్ధం గా ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తామని, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో కలిసి ముందుకెళ్తున్నామని ఆయన తెలిపారు. ఇదే సంప్రదాయాన్ని ఎప్పటికీ కొనసాగిస్తామని చెప్పారు.
రహమత్‌నగర్, బోరబండ డివిజన్ ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎస్‌పీఆర్ హి ల్స్‌లో ఏర్పాటు చేసిన జీఎల్‌ఎస్ రిజర్వాయర్‌ను శనివారం ప్రారంభించగా, మంత్రి పొన్నం ప్రభాక ర్, మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి పాల్గొన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలు ఎన్నో ఏండ్లుగా సరైన సమయానికి తాగునీరు రాక తీవ్ర ఇబ్బందు లు పడే వారని, ఈ రిజర్వాయర్ నిర్మాణంతో వీరి కష్టాలు తీరినట్టేనని తెలిపారు.
హైదరాబాద్ రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో నగర ప్రజలకు తాగునీరు, రోడ్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించేందుకు సమగ్రమైన ప్రణాళిక రూపొందించి ముందుకెళ్లాల్సిన అవసరముందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గోదావరినది నుంచి నగరానికి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేశారని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ కూడా నగర తాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాలను రప్పించారని పేర్కొన్నారు. గత పదేళ్లలో నగరం ఎంతో విస్తరించించాన్నాఆరు.
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి: మంత్రి పొన్నం
హైదరాబాద్ నగర అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రహమత్‌నగర్, బోరబండ డివిజన్‌లో 18 వేల కుటుంబాలకు మూడు రోజులకు ఒకసారి అర్ధరాత్రిళ్లు నీరు వచ్చేవని, ఈ సమస్యకు చెక్ పెడుతూ రూ.5.75 కోట్లతో నిర్మించిన రిజర్వాయర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. 2015లో 8 లక్షల నల్లా కలెక్షళ్లు ఉంటే పదేండ్లలోనే 13.80 లక్షలకు పెరిగాయని తెలిపారు.
గడిచిన పదేండ్లలో కొత్త లైన్ వేయకపోవడంతో హైదరాబాద్ ప్రజలు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.7,400 కోట్లతో 20 టీఎంసీల నీటిని నగరానికి తీసుకొచ్చే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిందని.. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. మూసీ క్లీనింగ్ కోసం రూ. 3,800 కోట్లతో 39 ఎస్‌టీపీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయన్నారు.