calender_icon.png 18 May, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల డిమాండ్ల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి

18-05-2025 12:50:38 AM

  1. త్వరలోనే పూర్తిస్థాయి కార్యాచరణ ప్రకటిస్తాం
  2. ఉద్యోగ సంఘాల మాజీనేతలు, ప్రతినిధులతో కేటీఆర్, హరీశ్‌రావు

హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ర్ట ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకుంది. ప్రధాన ప్రతిపక్షంగా, లక్షలాది ఉద్యోగులను రాష్ర్ట ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుంటే చూస్తూ ఊరుకోలేమని బీఆర్‌ఎస్ స్పష్టం చేసింది. శనివారం హరీశ్‌రావు నివాసంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావు ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో భేటీ అయ్యారు.

ఉద్యోగులతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విస్తృతంగా చర్చించారు. అధికారంలోకి రాక ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను రాష్ర్ట ప్రభుత్వం నెరవేర్చకపోవడం, డీఏ బకాయిలు, పీఆర్సీ వంటి డిమాండ్లను పట్టించుకోకపోవడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను సకాలంలో ఇవ్వడం లేదన్నారు.

తమ సమస్యలపై ప్రశ్నించేందుకు ప్రయ త్నం చేస్తున్న ఉద్యోగులపై వివిధ రకాలుగా ఒత్తిడి తేవడం వంటి అంశాలను పార్టీలోని మాజీ ఉద్యోగ సంఘాల నాయకులు కేటీఆర్, హరీశ్‌రావు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలబడతామని కేటీఆర్, హరీశ్‌రావు వారికి భరోసా ఇచ్చారు.