calender_icon.png 5 November, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా కొడుకుకు ప్రాణభిక్ష పెట్టండి

04-11-2025 12:00:00 AM

ఆర్థిక సహాయం కోసం తల్లి ఎదురుచూపులు 

ముస్తాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన గడప మాధవి  బాలకృష్ణ దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు కలరు.  కొడుకు విగ్నేష్, మహర్షి స్కూల్ లో 6 వ తరగతి చదువుతున్నాడు. విగ్నేష్ కు రెండవసారి లివర్ ఆపరేషన్ ముస్తాబాద్ లోని పీపుల్స్ ఆసుపత్రిలో బుధవారం రాత్రి జరగనుంది. ఈ కుటుం బం వద్ద డబ్బులు లేకపోవడంతో ఆర్థిక సహాయం కోసం తల్లి మాధవి దాతలను కోరుతుంది.

ఈ దంపతులకు తల్లి, తండ్రి లే రు. బాలకృష్ణ దంపతులు నిరుపేద కుటుంబానికి చెందినవారు.  ఐడియా కంపెనీలో సిమ్స్ సేల్స్ చేస్తూ భార్య పిల్లలను పోషించుకుంటున్నాడు. రెక్కాడితే డొక్కాడని కుటుంబం వీరిది. ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఈ క్రమంలో కొడుకు విగ్నేష్ కు 3 సంవత్సరాల వయసులో లివర్ వ్యాధి సోకింది. అప్పుడు వైద్యం కోసం, లివర్ సర్జరీ కోసం దా దాపు 8 లక్షల వరకు అప్పులు చేసి సర్జరీ చేయించారు.

మళ్లీ కొన్ని నెలల నుండి విగ్నేష్ అనారోగ్యానికి గురికాగా మళ్లీ వైద్యులు లివర్ ఆపరేషన్ చేయాలని సూచించారు. ఆపరేషన్ కు 3 లక్షల పైన ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపాలరు. అప్పుడు జరిగిన సర్జరీకి తెచ్చిన అప్పులే ఇంకా 5 లక్షలు ఉందని మాధవి రోదిస్తూ తెలిపింది. విగ్నేష్ అనారోగ్యానికి గురికాక ముందు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో అప్పులు చేసి ఇల్లు కట్టుకోవడం జరిగింది.

బ్రతకడానికి కష్టంగా ఉండగా సొంత ఇంటి కల నిజమైందని సెల్ఫోన్ సిమ్ములు అమ్ముతూ హోమ్ లోన్ ఈఎంఐ లు కట్టుకుంటున్నారు. ఈ క్రమంలో విగ్నేష్ కు మళ్ళీ లివర్ వ్యాధి సోకడంతో వైద్య ఖర్చు లేక ఈ దంపతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ కొడుకు ఆపరేష న్ కోసం ఆర్థిక సహాయం అందించాలని దాతలను ఈ దంపతులు వేడుకుంటున్నారు. మాధవి సెల్ ఫోన్ పే 9133934308 నెంబర్‌కు నేరుగా దాతలు సహాయంఅందించాలనికోరుతున్నారు.