26-08-2025 02:01:27 AM
-బీజేపీలోకి మక్తల్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు
-కమలం కండువా కప్పి ఆహ్వానించిన ఎంపీ డీకే అరుణ
మహబూబ్ నగర్ ఆగస్టు 25 (విజయ క్రాంతి) : ఆదరించండి ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అ రుణ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కేం ద్రంలోని ఎంపీ డీకే అరుణ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో బీజేపీలో చేరిన 50 మంది నర్వ, ఉందెకోడ్, ఇతర గ్రామాల కాంగ్రెస్ ముఖ్య నాయకు లు, కార్యకర్తలు చేరారు.
పార్టీలో చేరిన వా రికి కమలం కండువాలను కప్పి ఎంపీ డీకే అరుణ బిజెపిలోకి ఆహ్వానించారు. ముఖ్య నాయకులు పగడాకుల శ్రీనివాస్, లక్ష్మీకాం త్ రెడ్డీ, నర్వ మండల అధ్యక్షులు అజిత్ సిం హారెడ్డి సారధ్యంలో చేరికలు జరిగాయని, పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయాలని సూచించారు.
పార్టీలో చేరిన వారిలో నీరజ్, లక్ష్మణ్ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, సంధ్య ఆంజనేయులు, రాజేంద్ర కుమార్, నర్వ మండలానికి చెందిన చాకలి బుజ్జన్న, గుర్లపల్లి వెంకటేష్, పెద్ద రాములు, నక్క కుర్మన్న తో నాయకులు ఉన్నారు.