calender_icon.png 26 August, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలి

26-08-2025 01:59:31 AM

రాజాపూర్ ఆగస్టు 25 : : కాంగ్రెస్ ప్రభు త్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యా రెంటీలు వెంటనే అమలు చేయాలని బిజెపి రాజాపూర్ మండల అధ్యక్షులు కాటేపాగ ఆనంద్, పలువురు బిజెపి నాయకులు డి మాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని సోమవారం తహ సీల్దార్ రాధాకృష్ణకు వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఆనంద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గద్దెనెక్కేందుకు చేతకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తుందన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు ఇవ్వడం లేదని అన్నారు. మహిళలకు ఇస్తానన్న మహాలక్ష్మి పథకం ఏమైందని అన్నారు.కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతోపాటు తులం బంగారం ఇస్తానని నేడు ఆ హామీని నెరవేర్చలేక ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.