calender_icon.png 8 July, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధాశ్రమంలో అన్న ప్రసాద వితరణ..

26-05-2025 11:06:15 PM

మునగాల: సూర్యాపేట జిల్లా(Suryapet District) మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో జగ్గయ్యపేట వాస్తవ్యులు పచ్చిపాల సాయిగోపి, జన్మదినం సందర్భంగా ఆశ్రమంలో ఉన్న అనాధలకు, వృద్ధులకు, మానసిక వికలాంగులకు వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, స్వీట్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా 20 లీటర్ల రైస్ కుక్కర్, ఎలక్ట్రికల్ స్టవ్ లను సుమారుగా 18000 విలువగల వస్తువులను ఆశ్రమానికి అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఇలా పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలు అలాగే వారి వారి గృహాలలో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా ఇలా ఆశ్రమాలలో అన్నదానం చేయడం పుణ్యకార్యం అని ప్రతిఒక్కరు స్పందించి ఇలాంటి ఆశ్రమాలకు ఇలాంటి అన్నదాన కార్యక్రమాలతో పాటు ఎవరికి తోచిన విధంగా వారు నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఆశ్రమానికి కావాల్సిన వివిధ గృహపకరణ వస్తువులతో పాటు వారికి తోచిన విధంగా ఆర్థిక సహాయ సహకారాలు అందించి అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  పచ్చిపాల సాయి గోపి, వారి సతీమణి శ్రీ బిందు, ఆశ్రమం నిర్వాహకులు నాగిరెడ్డి విజయమ్మ, కోఆర్డినేటర్ వాచేపల్లి జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.