20-11-2025 12:00:00 AM
కోయంబత్తూరలో ప్రధాని మోదీ
చెన్నై, నవంబర్ 19: రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధులను విడుదల చేసింది. పధాని మోదీ కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 21వ విడత నిధులను ప్రధాని విడుదల చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని కోయంబత్తూరులో బుధవారం ప్రకృతి వ్యవ సాయం పై నిర్వహించిన దక్షిణ భారత సదస్సులో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులఖాతాల్లో రూ.18 వేల కోట్లకు పైగా నిధులు జమకానున్నాయి. ప్రతి రైతుకు రూ.2వేలు అందుతుంది.
ప్రకృతి వ్యవసాయానికి కేరాఫ్ భారత్
బహిరంగ సభలో ప్రధాని మోదీ మా ట్లాడుతూ.. ‘సేద్యంలో రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగంతో నేల సారం దెబ్బ తింటుంది. పంట వైవిధ్యీకరణ, సేంద్రియ సాగుతో ఈ సమస్యకు పరిష్కా రం లభిస్తుంది. సేంద్రియ సాగులో ప్రపంచానికి కేంద్రంగా నిలిచే దిశగా భారత్ పయ నిస్తుంది’ అని పేర్కొన్నారు. తృణధాన్యాలను ‘సూపర్ ఫుడ్’గా పేర్కొన్నారు. ఈపంటలను సాగుచేయాలని రైతులకు పిలుపునిచ్చారు.