20-11-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, నవంబర్ 19: అల్‌ఫలా విశ్వవిద్యాలయం తప్పుడు అక్రిడిటేషన్ చూపి, విద్యార్థుల నుంచి మొత్తం రూ.415.10 కోట్లు ఫీజు గుంజిందని ఈడీ అధికారులు తెలిపారు. ఢిల్లీ పేలుడు కేసు నేపథ్యంలో మార్మోగుతున్న అల్‌ఫలా వర్సిటీపై మంగళవారం ఈడీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిందే. ఫీజుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్వచ్ఛంద విరాళంగా పేర్కొన్నదని ఈడీ అధికారులు తెలిపారు.
ఎటువంటి గుర్తింపు లేకుండానే విశ్వవిద్యాలయాన్ని నిర్వహిస్తూ.. ఫీజులు వసూలు చేసినట్లు ఆరోపించారు. వర్సిటీకి చెందిన ప్రధాన కార్యాలయంలోతోపాటు ట్రస్టీల ప్రాంగణంలో దాడుల అనంతరం మనీలాండరింగ్ కేసులో ఈడీ వర్సిటీ చైర్మన్ జావెద్ అహ్మద్ సిద్దిఖీని అరెస్టుచేసి విచారిస్తున్నారు. సోదా ల్లో రూ.48లక్షలకు పైఆ నగదు, డిజిటల్ పరికరాలు, డాక్యుమెంటరీ ఆధారాలను సేకరించామని పేర్కొన్నారు.
గత ౧౧ ఏళ్ల పాటు వర్సిటీ ఆదాయ పన్ను రిటర్నులలో ఫీజుల ఆదాయాన్ని స్వచ్ఛంద విరాళంగా చూపినట్లు ఈడీగుర్తించింది. ఈ నిధులను ఆర్థిక నేరాలకు మళ్లించినట్లు ఆధారాలు బయటపడ్డాయి. అయితే అక్రమంగా కూడగట్టిన ఈ నిధులను ఎక్కడికి మళ్లిస్తున్నారు? ఉగ్రవాదానికి మళ్లించారా? కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఈడీ అధికారులు తెలిపారు.