calender_icon.png 15 November, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మన్ కీ బాత్ లో ప్రసంగించిన ప్రధాని మోదీ

28-07-2024 04:01:10 PM

న్యూఢిల్లీ: మన్ కీ బాత్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రసంగించారు. పారిస్ ఒలింపిక్స్ లోని మన భారత్ క్రీడాకారులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్ మన ఆటగాళ్లు సత్తా చాటాలని, ప్రపంచస్థాయిలో త్రివర్ణ పతాకం ప్రదర్శించే అవకాశం భారత్ కు వచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అసోంలోని చారిడియోను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. అది భారత్ లో 43వ యునెస్కో సైట్ గా నిలిచిందన్నారు.

ఆగస్టు 7వ తేదీన చేనేత ఉత్పత్తుల దినోత్సవం జరుపుకుంటున్నామని ప్రధాని మోదీ తెలిపారు. చేనేత ఉత్పత్తులను ప్రజలంతా ఆదరించాలని, దేశంలో ఖాదీ వస్త్రాల కొనగోళ్లు 400 శాతం పెరిగాయని చెప్పారు. మై ప్రొడక్ట్ మై ప్రైడ్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని, మీరు చేసే చిన్న ప్రయత్నంలో లక్షల మంది జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆయన సూచించారు. ఆగస్టు నుంచి ప్రజలంతా ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేయాలని, మనన్ పోర్టల్ ను సంప్రదించిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని మోదీ పేర్కొన్నారు.