calender_icon.png 10 July, 2025 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘డబుల్’ ఇళ్లను పరిశీలించిన పీఎంవో డైరెక్టర్

10-07-2025 01:13:00 AM

- లబ్ధిదారులతో మన్మీత్ కౌర్ ముఖాముఖి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 9 (విజయక్రాంతి): ప్రధానమంత్రి కార్యాలయ పీఎంవో డైరెక్టర్ మన్మీత్‌కౌర్ బుధవారం నగరంలోని పలు రెండు పడకల గదుల సముదాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఖైరతాబాద్‌లోని ఇందిరానగర్, బన్సీలాల్‌పేట్‌లోని జివైరెడ్డి నగర్‌లలో నిర్మించిన ఇళ్లను ఆమె తనిఖీ చేశారు.

ఇందిరానగర్‌లో నిర్మాణాలను పరిశీలించి.. లబ్ధిదారులతో మాట్లాడారు. సమస్యల గురించి తెలుసుకున్నారు. కేంద్ర పథకాలు అర్హులైన వారికి అందించేందుకు మేళాల ఏర్పాటుకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని ఆమె చెప్పారు. అంతకు ముందు హౌసింగ్ అధికారులు ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన, రెండు పడకల నిర్మాణం, పరిస్థితిని హౌసింగ్ అధికారులు  వివరించారు.

అనంతరం బన్సీలాల్‌పేట్ జి వై రెడ్డి  నిర్మాణ సముదాయాన్ని పరిశీలించారు. డైరెక్టర్ మన్మీత్ కౌర్ వెంట జిహెఎంసి కమిషనర్ ఆర్‌వి కర్ణన్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతం, సీఈలు నిత్యానంద, చైతన్యకుమార్, ఎస్‌ఈ వెంకటరెడ్డి, నర్సింగరావు, ఈఈ పివి రవీందర్, హైదరాబాద్ హౌసింగ్ పిడి ఉన్నారు. అంతకు ముందు ఢిల్లీ నుంచి వచ్చిన పిఎంవో డైరెక్టర్‌కు రాష్ర్ట పురపాలక పట్టణాభివృది శాఖ సెక్రెటరీ ఇలంబర్తి, కమిషనర్ ఆర్‌వి కర్ణన్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతం స్వాగతం పలికారు.