02-12-2025 02:23:15 AM
పాపన్నపేట/ రేగోడు, డిసెంబర్ 1 :మండల కేంద్రం పాపన్నపేటలో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందాలు సోమవారం పలు చోట్ల తనిఖీలు నిర్వహించాయి. ప్రయాణ ప్రాంగణ ప్రాంతం, ప్రధాన చౌరస్తా, దుకాణాల్లో సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలను గుర్తించేందుకు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా తనిఖీలు చేపట్టినట్లు ఎస్త్స్ర శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కానిస్టేబుళ్లు, తదితరులున్నారు.
రేగోడులో...
యాంటీ నార్కోటిక్ డాగ్ తో కొత్వాన్ పల్లి, రేగోడు గ్రామంలోని పలు కిరాణా దుకాణాలతో పాటు కల్లు దుకాణాలను నార్కో టిక్ డాగ్ తో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ పోచయ్య మాట్లాడుతూ మత్తు పదార్థాలు గానీ గంజాయి వంటి పదార్థాలు ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.