calender_icon.png 24 July, 2025 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోక్సో నిందితుడికి మల్టీజోన్ లా అండ్ ఆర్డర్ బాధ్యతలు

24-07-2025 12:00:00 AM

  1. పావులు కదిపిన స్థానిక ఎమ్మెల్యే 

పోలీస్ శాఖలో మితిమీరిన రాజకీయ జోక్యం 

నిజామాబాద్, జులై 23: (విజయ క్రాంతి) : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో పోలీస్ శాఖను అధికారులు శాంతి భద్రతలను గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తుండగా మితిమీరిన రాజకీయ జోగ్యంతో  అక్రమార్కులు అందలం ఎక్కుతున్నారు.

క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ శాఖలో రాజకీయ జోక్యం అదికంగా ఉందనడానికి  పోక్సో కేసులో ఉన్న పోలీసు అధికారికి సర్కిల్ వన్ ఇన్చార్జిగా ఇవ్వడమే ఎందుకు నిదర్శనం సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే వారికి శిక్ష పడేలా పోలీసులు  దర్యాప్తు చేసి తగిన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించి ముద్దాయిలకు శిక్ష పడేలా చేస్తారు. కానీ, పోలీసులే సాంఘిక చర్యలకు పాల్పడితే ఇక దిక్కు ఎవరు..!   

గతంలో అత్యాచారయత్నం కేసులో ఇరుక్కున్న ఓ ఇన్‌స్పెక్టర్‌కు ప్రస్తుతం కీలకమైన సర్కిల్ బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు రావడం నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపింది. గతంలో ఇతర జిల్లాలో పనిచేసే సమయంలో ఓక మైనర్ బాలికపై సదరు ఇన్‌స్పెక్టర్ అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటన 2024లో చోటు చేసుకుంది. కాగా అప్పటి జిల్లా ఎస్పీ అతడిపై పోక్సో సహా అత్యాచారయత్నం తో పాటు పలు సెక్షన్ల తో కేసులు నమోదు చేశారు. 

తదనంతరం అతగాడిని విధుల నుంచి తొలగించారు. ఆ తర్వాత తిరిగి కొద్ది నెలలకు విధుల్లో చేర్చుకున్నారు. దర్యాప్తు  అనంతరం ఆ పోలీసు అధికారిని లూప్‌లైన్‌లో పోస్టింగ్ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తాజాగా మల్టీ జోన్1 పరిధిలోని ఓ జిల్లాలో కీలకమైన సర్కిల్ బాధ్యతలు అప్పగించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇందుకోసం ప్రత్యేకంగా జివో విడుదల చేయడం గమనార్హం.

సదరు ఇన్‌స్పెక్టర్‌పై తీవ్ర ఆరోపణలు ఉన్న విషయం ఉన్నతాధికారులకు తెలుసు. పైగా పోక్సో కేసు ప్రస్తుతం కోర్టులో విచారణ దశలో ఉండగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వడం పై పోలీస్ శాఖలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ ఇవ్వడం ఏమిటనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా పోస్టింగుల్లో ఉంటే అధికారం, పలుకుబడి అడ్డు పెట్టుకుని బాధితులు, సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు.

ఇవన్నీ తెలిసి మల్టీ జోన్1 అధికారులు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేయడం, సదరు అధికారి బాధ్యతలు తీసుకోవడం కూడా జరిగిపోయాయి. పైగా ఇసుక అక్రమ రవాణాకు పెట్టింది పేరుగా ఉన్న సదరు సర్కిల్‌కు ఈ అధికారిని సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నియమించారు. స్థానిక ఎమ్మెల్యే ఏరి కోరి మరీ సదరు అధికారిని తన నియోజకవర్గానికి తెప్పించు కోవడం పోలీస్ శాఖ లో రాజకీయ జోక్యానికి పరాకాష్ట గా మారింది. 

మరోవైపు తీవ్రమైన పీకల వరకు కేసులో ఉన్న అధికారికి పోస్టింగు ఇవ్వడంపై నిఘా వర్గాలు ఆరా తీసినట్లు సమాచారం. రాష్ట్రంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని చెబుతున్న ప్రభుత్వం మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి ఏకంగా లా అండ్ ఆర్డర్ పోస్టింగులు ఇవ్వడంపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మరోవైపు సదరు సీఐకి సంబంధించిన పోక్సో కేసు విచారణ దశలో కొనసాగుతుండగా తీర్పురి ఏ రకంగా వస్తుందో అన్న కనీస ఆలోచన లేకుండా అధికారికి పోస్టింగ్ ఇవ్వడం శోచనీయం యం. విచారణ పూర్తయి పూర్తి శిక్ష విధిస్తూ తీర్పు ఇస్తే అప్పుడు పోలీస్ శాఖ పరువు ప్రతిష్టలు ఏమవుతాయి...?