calender_icon.png 16 September, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవి రవీందర్‌కు ఘనంగా సన్మానం

16-09-2025 12:00:00 AM

తాడ్వాయి, సెప్టెంబర్, 15 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన యువ కవి రవీందర్ కు సోమవారం ఘనంగా సన్మానించారు హైదరాబాదులోని త్యాగరాయ గానసభ వేదికలో కొమర్రాజు ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో కవిని శాలువాతో సత్కరించారు ఆయనకు సినారే గజల్ పురస్కారం అందించారు ఈ సందర్భంగా కౌడి రవీందర్ మాట్లాడుతూ... తాను నిరంతరం సమాజ సేవకు ఉపయోగపడే కవిత్వాలు చేస్తున్నట్లు తెలిపారు

యువతను మరింత ముందుకు తీసుకువెళ్లే కవిత్వాలు రూపొందిస్తానని వివరించారు సినారె గజల్ పురస్కారం అందుకోవడంతో నాకు ఎనలేని ఆనందం కలిగిందన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ గజల్ కవి సూరారం శంకర్, ప్రొఫెసర్ గౌరీ శంకర్ నామోజు బాలా చారి, సుబ్రహ్మణ్య శర్మ తదితరులు పాల్గొన్నారు