calender_icon.png 8 October, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పసికందులకు విషం!

05-10-2025 12:00:00 AM

తమిళనాడు ప్రభుత్వం ‘కోల్డ్రిఫ్’ దగ్గు మందుపై కీలక నిర్ణయం తీసుకుంది. మధ్య ప్రదేశ్, రాజస్థాన్‌లో 11 మంది చిన్నారుల మరణాలకు కారణమైన ‘కోల్డ్రిఫ్’ను రాష్ట్రంలో నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే ఈ నిషేధం అమల్లోకి వస్తుందని ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని సుంగువర్చత్రంలోని ఔషధ కంపెనీలో తయారైన ‘కోల్డ్రిఫ్’లో డై ఇథిలిన్ గ్లుకాల్ (డీఈజీ) మో తాదుకు మించి ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.

ఇటీవలే మధ్యప్రదేశ్, రా జస్థాన్‌లకు సరఫరా అయిన ‘కోల్డ్రిఫ్’ దగ్గు మందులోనూ ‘డై ఇథిలిన్ గ్లుకాల్’ అధికంగా ఉండడమే చిన్నారుల ప్రాణాలు పోవడానికి కారణమ ని కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘కోల్డ్రిఫ్’ దగ్గు మందు ప్రాణాంతకం అని తెలిసిన వెంటనే కేంద్రం ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లా నుంచి ‘కోల్డ్రిఫ్’కు సంబంధించి ఆరు నమూనాలను సేకరించింది.

అయితే నమూనాల పరీక్షలో ‘కోల్డ్రిఫ్’లో ‘డై ఇథిలిన్ గ్లుకాల్’ పరిమితికి మించి లేనట్టుగా తేలింది. అయితే మధ్యప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ‘కోల్డ్రిఫ్’ తయారీ కేంద్రానికి వెళ్లి పరీక్షించగా.. ‘డై ఇథిలిన్ గ్లుకాల్’ మోతాదుకు మించి ఉన్నట్లు తేలింది. దీంతో తమిళనాడు, మధ్య ప్రదేశ్ రా ష్ట్రాలు వెంటనే ‘కోల్డ్రిఫ్’ దగ్గు మందును నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నా యి.

ఈ ఉదంతంతో కేంద్రం ఆరు రాష్ట్రాల్లో ఉన్న 19 ఔషధాల తయారీ కంపెనీల్లో మందుల తయారీలో నాణ్యత ప్రమాణాలను వెలికి తీసేందు కు తనిఖీలకు ఆదేశించింది. చిన్నారుల మరణాలపై నివేదిక తయారు చే సేందుకు ఎన్‌ఐవీ, ఐసీఎంఆర్, ఎన్‌ఈఈఆర్‌ఐ, సీడీఎస్సీవో, ఎయిమ్స్ నాగ్‌పూర్‌కు చెందిన నిపుణుల బృందం తమ దర్యాప్తు ప్రారంభించింది. ‘కోల్డ్రిఫ్’లో ఉపయోగిస్తున్న ‘డై ఇథిలిన్ గ్లుకాల్’ విషపూరిత సమ్మేళనం.

ఇది మూత్ర పిండాలు, కాలేయం, నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. పిల్లల్లో వికారం, కడుపు నొప్పి, మూత్రంలో మంట లాంటి లక్షణాలు కనిపిస్తా యి. గతంలోనూ కలుషిత మందులు ప్రాణాలు తీసిన సంఘటనలు కో కొల్లలు. 2022లో గాంబియాలో కలుషితమైన దగ్గు మందు 70 మంది చిన్నారుల ప్రాణాలను చిదిమేసింది. గతేడాది ఆగస్టులో భారత ప్రభు త్వం..

జ్వరం, జలుబు, అలర్జీ, నొప్పులకు తరచూ వినియోగించే 156 ర కాల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డీసీ) ఔషధాలపై నిషేధం విధించింది. రెండు లేదా అంతకంటే ఎక్కువ కాంబినేషన్ ఉన్న ఈ మందులు వినియోగించడం వల్ల పలు దుష్ప్రభావాలు కలిగే అవకాశముందని తెలిపిం ది. కేంద్రం నిషేధించిన వాటిలో అమిడోపైరిన్, ఫెనాసెటిన్, నియాలమై డ్, మెట్రోనిడాజోల్, ఫురాజోలిడోన్ లాంటివి ఉన్నాయి.

తాజాగా చిన్నారుల మరణాలకు కారణమైన ‘డై ఇథిలిన్ గ్లుకాల్’తో తయారవుతున్న ఔ షధాలు కలుషితమవుతున్నాయని ప్రపంచ ఆర్యోగ సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గతంలోనే హెచ్చరించింది. దీనివల్ల 2022 నుంచి ప్రపంచ వ్యా ప్తంగా 300 మందికి పైగా చిన్నారులు మరణించినట్లు పేర్కొనడం గమనార్హం. ఇప్పటికైనా కేంద్రం తక్షణమే చొరవ తీసుకొని కలుషిత మం దులను అరికట్టడంతో పాటు, వాటిని తయారు చేస్తున్న ఫార్మాస్యూ టికల్ కంపెనీలపై నిఘా పెంచాల్సిన అవసరది.