07-11-2025 12:35:32 AM
హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి) : పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీ ఏ) సమావేశం శుక్రవారం నిర్వహించనున్నా రు. పీపీఏ సీఈవో ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశం హైదరాబాద్‌లోని సీడబ్ల్యూసీ కార్యాలయంలో జరగనుంది. కేంద్ర జల్‌శక్తి శాఖ నుంచి జాయింట్ సెక్రటరీ, తెలంగాణ ప్రభుత్వం తరఫున నీటి పారుదల శాఖ ము ఖ్యకార్యదర్శి, పీపీఏ చీఫ్ ఇంజినీర్లు, భూసేకరణ కమిషనర్, ఏపీ ప్రభుత్వం తరఫున జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, నీటి పారుదల శాఖ ఈఎన్సీ, పోలవ రం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్, ఏపీ జెన్‌కో చీఫ్ ఇంజినీర్ పాల్గొంటారు.
పోలవరం లింక్ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది. ఈ అంశం కూడా శుక్రవారం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో బనకచర్ల అంశం కొలిక్కి రాకుంటే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిం చేందు కు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
వెళదామా.. వద్దా..?
తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం పోలవరం- ప్రా జె క్టు డీపీఆర్ రూపకల్పన కోసం టెండర్లను ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే కేం ద్ర జలశక్తి శాఖతో పాటు కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టు డీపీఆర్ విషయంలో ఏపీ ముందుకెళ్లడం, అడ్డుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టులో కేసు దాఖలు ఒక్కటే మార్గమని తెలంగాణ ప్రభు త్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
సుప్రీంకోర్టులో కేసు వేయడం ద్వారా ఆ ప్రాజెక్టుకు పరోక్షంగా చట్టబద్ధత కల్పించినట్లవుతుందని, కేసును సుప్రీం స్వీకరిస్తే ఏ వేదిక ల్లో నూ వ్యతిరేకించడానికి అవకాశం లేకుం డా పోతుందని జలవనరుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసు వేయడం అంటే విపక్షం పన్నిన ఉచ్చులో చిక్కుకోవడమేనని అభిప్రాయపడుతున్నారు.