19-07-2025 02:14:36 AM
ప్రారంభించిన హీరో హీరోయిన్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 18 (విజయక్రాంతి): కొంపల్లిలో సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ ప్రారంభోత్సవం హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయన్ వైష్ణవి చైతన్య చేతుల మీదుగా జరిగింది. పెంపుడు జంతువులకు అంతర్జాతీయ స్థా యి నాణ్యమైన వైద్య చికిత్సను సెవెన్ ఓక్స్ మల్టీ స్పెషాలిటీ పెట్ హాస్పిటల్ అందిస్తోంది.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో డైరెక్ట ర్ మధుర శ్రీధర్ రెడ్డి, సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ శ్రీ రెడ్డి, సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ ఎండీ సంధ్య బీ రెడ్డి, వారి కూతురు అక్షత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ రెడ్డి మాట్లాడుతూ తమ జుబ్లీహిల్స్ బ్రాంచ్‌కు ఎక్కువగా కొంపల్లి సైడ్ నుంచే పెట్స్ ను చికిత్స కోసం తీసుకొస్తుండటంతో ఇక్కడే ఒక హాస్పిటల్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
పెంపుడు జంతువులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నట్టు పేర్కొన్నా రు. పెట్స్‌కు ఎంఆర్‌ఐ స్కానింగ్ అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వివరించారు. డా.సంధ్య బీ రెడ్డి మాట్లాడుతూ -హెర్మాయిన్ డంకన్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఆర్థికం గా స్థోమత లేని వారి పెంపుడు జంతువులకు సరైన వైద్యం అందిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో ఏ ఛారిటీ ఫౌండేషన్ వారు తమ సంస్థ తరఫున పెట్స్‌ను చికిత్సకు తీసుకువచ్చినా 50 శాతం రాయితీ ఇస్తున్నట్టు చెప్పారు.
హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ -మీరు భవిష్యత్‌లో ప్రారంభించే బ్రాం చులు సైతం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ - తాను పెట్ లవర్‌నని, తమ ఇంట్లో ఆల్ఫా అనే డాగ్ ఉందన్నారు. డైరెక్టర్ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తనకు పెట్స్ అంటే భయం ఉండేదని, కానీ తనకు దగ్గరైన మిత్రులంతా పెట్ లవర్స్ అని చెప్పారు. వాళ్ల స్నేహంతో తనకు కూడా పెట్స్ దగ్గరయ్యాయన్నారు.