calender_icon.png 2 November, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భమ్ అని మోగే శంఖాలు..

02-11-2025 12:43:01 AM

మాస్టర్ మహేంద్రన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘వసుదేవసుతం’. వైకుంఠ్ బోను దర్శకత్వంలో రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల నిర్మిస్తున్నారు. అంబికావాణి, జాన్ విజయ్, మిమ్‌గోపి, సురేశ్‌చంద్ర మీనన్, ఐశ్వర్యలక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, భద్రమ్, జబర్దస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహ న్, సుమేత బజాజ్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్ ‘వసుదేవసుతం దేవం’ను హీరో ఆకాశ్ జగన్నాథ్ రిలీజ్ చేశారు. ‘భమ్ అని మోగే శంఖాలు.. ధర్మం నీదేనంటూ.. సత్యం సాగాలంటూ, ధమ్ అని రేగే ఢంకాలు.. స్వార్థం పోవాలంటూ.. న్యాయం ధ్యేయం అంటూ..’ అని సాగుతోందీ గీతం.

మణిశర్మ స్వరపర్చిన ఈ గీతానికి చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించగా.. పవన్, శ్రుతిక సముద్రాల ఆలపించారు. ఈ లిరికల్ వీడియోలో హీరోహీరోయిన్ జంట చూడముచ్చటగా ఉంది. ఊరి వాతావరణం, గుడిలో చిత్రీకరించిన ఈ పాట అందరినీ కట్టి పడేసేలా ఉంది. ఈ సినిమా విడుదల తేదీని, ఇతర వివరాలను త్వరలోనే చిత్ర యూనిట్ ప్రకటించనుంది. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ; పాటలు: చైతన్య ప్రసాద్, శ్రీహర్ష ఈమని; ఫైట్స్: రామకృష్ణ; డీవోపీ: జిజ్జు సన్నీ.