calender_icon.png 2 November, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చాంపియన్.. పక్కా హైదరాబాదీ

02-11-2025 12:47:05 AM

నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన నాయకానాయికల ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి.

ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. స్వాతంత్య్రానికి ముందు హైదరాబాద్‌లో నివసించే ఆర్మీ మ్యాన్, ఫుట్‌బాల్ ప్లేయర్ మైఖేల్ సీ విలియమ్స్. మైదానంలో ప్రత్యర్థులను సవాల్ చేస్తూ తన ప్రతిభను ప్రదర్శించే ఈ యంగ్‌మ్యాన్‌కి ఇంగ్లండ్‌లో రాణి ఎలిజబెత్‌ను కలుసుకునే అవకాశం దక్కుతుంది. దేశం కోసం ఆడే అవకాశమొచ్చినా, అతని మనసు మాత్రం తన ప్రేయసి వద్దే ఉంటుంది.

కానీ జీవితం అతనికి మరిన్ని సవాళ్లు, భావోద్వేగాలు, యుద్ధం, ప్రేమ.. అన్నీ ఒకేసారి ఎదురుచూపిస్తుంది. ఫుట్‌బాలర్‌గా రోషన్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించాడు. ఇందులో హైదరాబాదీ యాసలో హిందీ మిక్స్ చేసిన రోషన్ డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అనస్వర రాజన్ అందంగా కనిపించింది. ఇద్దరి కెమిస్ట్రీ మనసుకు హత్తుకునేలా ఉంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రానికి డీవోపీ: ఆర్ మధీ; సంగీతం: మిక్కీ జే మేయర్; ప్రొడక్షన్ డిజైన్: తోట తరణి; ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర 

రావు.