calender_icon.png 13 December, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన

10-12-2025 12:21:41 AM

రామాయంపేట, డిసెంబర్ 9 :సైబర్ నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్థానిక సీఐ వెంకట రాజాగౌడ్, ఎస్త్స్ర బాలరాజ్ ఆధ్వర్యంలో రామాయంపేటలో కళాశాల విద్యార్థుల కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి కాలంలో సైబర్ క్రైమ్లు విపరీతంగా పెరిగినందున సెల్ ఫోన్లు ఉ పయోగించే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.

విద్యార్థులు సైబర్ నేరాల బారిన పడకుం డా మోసపోవద్దన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి చక్కటి విద్యను అభ్యసించాలన్నారు. ఈ కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారి సతీశ్, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, చత్రపతి శివాజీ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సందీప్ కుమార్,  విద్యార్థులు పాల్గొన్నారు.