10-12-2025 12:22:48 AM
రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి
సూర్యాపేట, డిసెంబర్ 9 (విజయక్రాంతి) : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు భారీగా కాంగ్రెస్లో చేరుతున్నారని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మామిడి తిరుమల్ తమ అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి మూడు రంగుల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారన్నారు. తెలంగాణను 2047 నాటికి చైనా, జపాన్ లాంటి అగ్ర దేశాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లే సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నారన్నారు.
ఇటీవల జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడం ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనం అన్నారు. ఈ ప్రభుత్వ ఆహాయంలో అన్ని రంగాల ప్రజలు అభివృద్ధి చెందడం ఖాయం అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు .ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.