12-07-2025 01:00:16 AM
పోలీస్ స్టేషన్ రైటర్స్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన పోలీసు కమిషనర్
నిజామబాద్, జూలై 11 :(విజయ క్రాంతి) ప్రస్తుత కా లానికి అనుగుణంగా కేసుల పరిష్కారానికై సాంకేతిక పరి జ్ఞానాన్ని విస్తృతంగా వాడాలని నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య అన్నారు.సాంకేతిక నూతన పద్ధతులను ఉప యోగిస్తూ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న నేరాల ని యంత్రణకు కేసులలో పురోగతి సాధించడానికి కొత్తదనం తీ సుకువచ్చి కేసుల పరిష్కారానికి సిపి సాయి చైతన్య, పోలీస్ సిబ్బందికి సూచించారు.
శుక్రవారం నిజామాబాదు పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాలులోవహించిన పోలీస్ స్టేషన్ రైటర్స్ శిక్షణలో భాగంగా జరిగిన కార్యక్రమం కి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో గల కేసుల యొక్క పరిశోధనలో నాణ్య తను పెంచి ఎఫ్.ఐ.ఆర్ నుండి చార్జ్ షీట్ రిపోర్టు వరకు ఉండవలసిన మెలకువలు గురించి అనగా ఎఫ్.ఐ.ఆర్ , పంచనామా, నేరస్తుల ఒప్పుకోలు పంచనామ స్టేట్మెంట్ రికార్డు చే యు విధానము గోప్యత పాటించాలని తదితర అంశాలను క్షుణ్ణంగా వివరించరు.
నూతన చట్టాల పై అవగాహన కల్పించి జరిగినటువంటి నేరానికి నేర స్థలానికి జత చేయడం విషయాలను నూతన టెక్నాలజీని వాడుకునే విషయంలో ఏ ఏ పద్ధతులని సిబ్బందికి వివరించారు.పాత కేసుల యొక్క విచారణలో ఉన్నటువంటి విషయాలు తెలియపరచి చార్జ్ షీట్ రిపోర్టు కోర్టులలో సమర్పించె వరకు ఫారిన్సిక్ సైన్స్ ను వాడుకునే విధివిధానాలను మరియు కోర్టులో వేసే చార్జ్ షీట్ తయారుచేసి విధివిధానాలను కూడా డిపి తెలియజేశారు.
ఈ శిక్షణను మూడు రోజులపాటు నిర్వహించ నున్నారు.స్టేషన్ రైట్స్ సంబంధిత పోలీస్ స్టేషన్లో వెళ్లిన తర్వాత తమ సిబ్బందికి సంబంధిత అధికారికి ఈ శిక్షణ కాలంలో నేర్చుకుంది వివరించాలని ఆయన కోరారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేసులలో పరిపక్వతను సాధించాలని అప్పుడే పోలీస్ శాఖ గౌరవం ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ ( అడ్మిన్ ) శ్రీ బస్వా రెడ్డి ట్రైనింగ్ సిటిసిఎసిపి శ్రీ మస్తాన్ అలీ, ఐటి కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.