27-01-2026 01:40:33 AM
సోషల్ మీడియాలో ప్రకటన
షాపు వద్దకు భారీగా జనాలు
మోసమని తేలడంతో దాడి చేసిన ప్రజలు
కేసు నమోదు చేసిన పోలీసులు.. యజమాని అరెస్ట్
ఉప్పల్, జనవరి 26 (విజయక్రాంతి) : 26 వేలకే పాత కార్లు మీ సొంతం అంటూ ఓ వ్యాపారి చేసిన ప్రకటన ఉద్రిక్తత పరిస్థితికి దారి చేసింది.ప్రకటన చూసిన జనాలు ఉదయాన్నే 26,000 పట్టుకొని కార్ల షోరూమ్‌కి పెద్ద ఎత్తున క్యూ కట్టారు. తీరా ఆ వ్యాపారి కారు లేదు చెప్పడంతో ఆగ్రహానికి గురైన ప్రజలు అక్కడ ఉన్న కార్లపై రాళ్లతో దాడి చేయడంతో విషయం తెలిసిన పోలీసులు రంగ ప్రవేశం చేసి వ్యాపారిని అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రోషన్ అనే వ్యక్తి ట్రస్ట్ కారడ్స్ పేరుతో నాచారంలో సెకండ్ హ్యాండ్ కార్లను అమ్మకాలు, కొనుగోలు చేసేవాడు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఇన్స్టా వంటి గ్రూపుల్లో తమ వద్ద 26 వేలకే కారులు ఉన్నాయంటూ రిపబ్లిక్ డే స్పెషల్ అంటూ విస్తృతప్రచారం చేసుకున్నారు. ప్ర స్తుతం సెకండ్ హ్యాండ్ కార్లకున్న డిమాండ్‌తో ఈ ప్రకటన కాస్త నెట్టెడ్ వైరల్ గా మా రింది.
అతి తక్కువ ధరకే కారు దొరుకుతున్న ఆశతో తెల్లవారుజామునే రోషన్ షో రూమ్ వద్దకు చేరుకున్నారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. తీరా షాప్ తెర్చిన తర్వాత కార్లు లేవంటూ సిబ్బంది, రోషన్ సమాధానం ఇచ్చారు. దీంతో వచ్చిన ప్రజలు ఆగ్రహానికి గురై రాళ్లతో దాడి చేశా రు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రికంగా మారడంతో నాచారం పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ప్రకటన ఇచ్చి ప్రజలను మోసపూరితగా తప్పుదోవ పట్టించిన రోషన్ పై కేసు నమోదు చేసినట్లు నాచారం ఇన్స్‌పెక్టర్ ధ నంజయ గౌడ్ పేర్కొన్నారు. సోషల్ మీడియాల వచ్చే ప్రకటన పట్ల అప్రమత్తంగా ఉం డాలని ఆయన ప్రజలకు సూచించారు.