calender_icon.png 27 January, 2026 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశ్నించే గొంతులపై దాడి

27-01-2026 01:37:58 AM

పీఆర్సీ అడిగితే ఏసీబీ దాడులు 

ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సీట్ నోటీసులు 

రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన రేవంత్ 

మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, జనవరి 26 (విజయక్రాంతి): అద్భుతంగా ఉన్న రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అంధకారంలోకి వెళ్లిందని, ప్రశ్నించే గొంతులపై దాడి చేయడం, పీఆర్సీ అడిగితే ఉద్యోగులపై ఏసీబీ దాడులు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సీట్ నోటీసులు ఇవ్వడం, కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యంపై అత్యంత దారుణంగా దాడి జరుగుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. సోమవారం సిద్దిపేట ఎన్జీవో భవన్‌లో జరిగిన ఉత్తమ ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుందని అన్నారు.

రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఎన్జీవోస్ కు సొంత భవనం ఉండడం ఉపాధ్యాయ దినోత్సవం, పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు, ఉత్తమ ఉద్యోగులను సన్మానించడం సిద్ధిపేట ఎన్జీవోస్ కు మాత్రమే సాధ్యమవుతుందన్నారు.మంచి ఉద్యోగులను, ఉపాధ్యాయులను, విద్యార్థులను సన్మానించడం సమాజాన్ని గౌరవిం చడంతో సమానం అన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం రెండేళ్ల పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని కోరితే కాలేజీలపై విజిలెన్స్ దాడులు చేయ డం సిగ్గుచేటన్నారు.రెండేళ్లలో రూ.95 వేల కోట్ల కాంట్రాక్టర్లకు టెం డర్లు పిలిచి అవార్డు చేసిందన్నారు.

సుమారు రూ.30 వేల కోట్ల కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారని, పదవి విరమణ పొందిన ఉద్యోగులకు వారి సొ మ్ము ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని చెప్పడం దారుణమన్నారు.రేవంత్ రెడ్డి సీఎం కావడం వల్ల రియల్ ఎస్టేట్ ది వాళా తీసిందన్నారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు, కరెంటు, డీఏలు ఎప్పుడు ఆగలేవన్నారు. సిద్దిపేటపై ఈర్ష్యతో వెటర్నరీ కాలేజీ, వెయ్యి పడకల ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీ పనులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట పదేళ్ల పాలనలో 20 ఏళ్లు ముందుకు తీసుకుపోతే కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి వెనక్కి నెట్టి వేయబడిం దన్నారు. కాంగ్రెస్‌కి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు.