calender_icon.png 19 August, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేష్ విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి

18-08-2025 11:37:11 PM

పాల్వంచ ఇంచార్జ్ సీఐ నాగరాజు

బూర్గంపాడు,(విజయక్రాంతి): వినాయక చవితి ఉత్సవాల సమయం ఆసన్నమైతున్న సందర్భంగా గ్రామాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేటప్పుడు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని పాల్వంచ ఇంచార్జ్ సీఐ నాగరాజు అన్నారు. సోమవారం బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో వివిధ గ్రామాలకు చెందిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గణేష్ విగ్రహ ఏర్పాటుకు రహదారికి ఆటంకం కల్పించ రాదన్నారు. పోలీస్ వారి అనుమతి లేకుండా వివాదాస్పద ప్రదేశాలలో విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదని తెలిపారు.

విగ్రహమును ఏర్పాటు చేయునప్పుడు విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కావున కమిటీ మెంబర్లు జాగ్రత్త వహించాలని, విగ్రహమును ఏర్పాటు చేసిన తర్వాత నవ రాత్రుల సమయంలో ఎటువంటి అశ్లీల కార్యక్రమాలు ఏర్పాటు చేయరాదన్నారు. ఎటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కైనా పోలీసు వారి అనుమతి తప్పనిసరి అని తెలిపారు. విగ్రహం వద్ద ఎటువంటి లాటరీలు జూదములు నిర్వహించకూడదన్నారు. విగ్రహాల వద్ద తప్పనిసరిగా కమిటీ మెంబర్లు రాత్రిపూట నిద్రించాలి. లేనిచో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగిన ఎడల వారే బాధ్యులవుతారన్నారు.

విగ్రహ నిమర్జనం సమయంలో ఎటువంటి డీజే లు ఏర్పాటు చేయరాదు వాటికి అనుమతి లేదు అన్నారు. రాత్రి నిర్ణీత సమయం దాటిన తర్వాత ఇతరులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా మైకులు ఆఫ్ చేయాలనుకోరారు. నిమజ్జనం చేయు తేదీ మరియు ప్రదేశమును ముందుగానే పోలీస్ వారికి తెలపాలన్నారు. నిమజ్జన ఊరేగింపు సమయంలో అనవసర గొడవలు గాని ఉద్రిక్తతలు గాని తలెత్తిన దానికి కమిటీ వారే బాధ్యులు అన్నారు. నిర్వాహకులు తమ ఉత్సవ కమిటీ సభ్యులందరినీ జాగ్రత్తలు పాటించేలా చూసుకోవాలన్నారు.