19-08-2025 12:00:00 AM
గాంధీనగర్ కార్పొరేటర్ పావని
ముషీరాబాద్, ఆగస్టు 18(విజయక్రాం తి): నులిపురుగుల నివారణకు పరిశుభ్రత, వైద్యుల సలహా మేరకు మందులు వాడడం ముఖ్యమని గాంధీనగర్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్‌కుమార్ అన్నారు. చిక్కడపల్లి లోని ఆంధ్ర మహా విద్యాలయం పాఠశాల లో సోమవారం నులిపురుగుల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు, అల్బెండజోల్, మెబెండజోల్ మందులను అందజేశారు.
పిల్లల ఆరోగ్యవంతమైన జీవితంలో నులిపురుగుల నివారణ ఎంతో అవసరమన్నారు. నులిపురు గుల నివారణకు పరిశుభ్రత పాటించడం, ఆహారం, నీటిని శుభ్రంగా ఉంచుకోవడం, ప్రతి ఆరు నెలలకు ఒకసారి నులిపురుగుల నివారణకై వైద్యుల సలహా మేరకు మందులు వాడడం ముఖ్యమన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీకాంత్, పి. నర్సింగ్ రావు, శివ కుమార్, సత్యేంధర్, ఎఎన్‌ఎం భవాని, ఆశావర్కర్లు లక్ష్మి, సుచిత్ర, మాధవి పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు.