24-07-2025 02:59:47 PM
మంథని, (విజయక్రాంతి): ఆగస్టు ఏడవ తేదీ నుండి పదవ తేదీ వరకు నాలుగు రోజులపాటు నిర్వహించే జాతీయ కరాటే పోటీలు న్యూఢిల్లీలోని తాల్కటోర ఇండోర్ స్టేడియంలో జరగబోయే జాతీయ కరాటే పోటీలకు(National Karate Competitions) శిక్షకులు కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన జపాన్ షిటోరియో సికో కాయ్ కరాటే విద్యార్థులు కథ, కుమితే విభాగాలలో ఎంపికైయారు.
ఎంపికైన విద్యార్థులు
అండర్ 17 ఎండి తహహసీన్ తైబా 15 ఏండ్లు, 68 కేజీలు
అండర్ 14 బండారి మణికంఠ 12 ఏండ్లు, 32 కేజీలు,
పోగుల శివ సాకేత్ 10 ఏండ్లు, 24 కేజీలు,
మారేడుగొండ రిషి 11 ఏండ్లు, 23 కేజీలు
ఎంపికైన విద్యార్థులను షిటోరియు షికో కాయ్ కరాటే ఇండియా అధ్యక్షులు పి. భరత్ శర్మ, తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అధ్యక్షులు బి. మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ షిటోరియు శికో కాయ్ కరాటే రిప్రజెంటివ్ పాలకుర్తి పాపయ్య, కార్య నిర్వహణ అధ్యక్షులు గుంటిపల్లి సమ్మయ్య, మల్యాల రామస్వామి, ఇన్స్ట్రక్టర్స్ నాగేల్లి రాకేష్, జడగల శివాని, కావేటి శివ, గణేష్, మెట్టు హాసిని, కే శ్వేత, నందన టి హర్షిని, కె. విష్ణు, హర్షవర్ధన్ లు అభినందించారు.