17-10-2025 12:00:00 AM
నిర్మల్, అక్టోబర్ 1౬ (విజయక్రాంతి): ఈనెల 21 నుంచి 31వ తేదీ వరకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసుల సంస్మరణ వేడుకలను ఘనం గా నిర్వహించాలని ఎస్పీ జాన కి షర్మిల ఆదేశించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో వేడుకల నిర్మ లపై పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. 21న అన్ని పోలీస్ స్టేషన్లో జెండా ను ఎగురవేసి అమరులైన పోలీసులకు నివాళులు అర్పించాలన్నారు.
24 వర కు అన్ని పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన ఉపన్యాస పోటీ లను నిర్వహించి ముగింపు వేడుకల్లో బహుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి పోలీ స్ స్టేషన్లో సంస్కరణ పోస్టర్‌ను ఏర్పాటు చేయాలని అమరులైన కుటుంబాల కష్టాలను తెలుసుకోవాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి అవినాష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.