calender_icon.png 20 October, 2025 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొగొట్టుకున్న సొత్తు అప్పగింత

17-10-2025 12:00:00 AM

-నిజాయితీ చాటిన ప్రయాణికుడు 

-సంగారెడ్డి బస్సులో బంగారం బిస్కెట్లు పొగొట్టుకున్న దంపతులు

సంగారెడ్డి, అక్టోబర్ 16 (విజయక్రాంతి): బంగారు బిస్కెట్లను పోగొట్టుకున్న వ్యక్తులకు ఓ ప్రయాణికుడు వాటిని అందజేసి నిజాయితీ చాటుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డికి చెందిన బీఎస్‌ఎన్‌ఎల్ రిటైర్డ్ ఉద్యోగి వసుధ ప్రకాశ్ భార్యాభర్తలు సికింద్రాబాద్‌లో వాళ్ల మనుమరాలి పెళ్లి కోసం 39 తులాల బంగారం బిస్కెట్లు కొనుక్కుని జూబ్లీ బస్టాండ్ నుంచి తిరిగి సంగారెడ్డి బస్సులో వస్తుండగా వారు కూర్చున్న సీటు ప్రక్కన పర్సు పడిపోయింది.వారు ఇంటికి వెళ్లి చూసుకునే వరకు గమనించలేదు.

అయితే అదే బస్సులో కోరంపల్లికి చెందిన ప్రయాణికుడు సీహెచ్ దుర్గయ్య ఆ పర్సును గమనించి ఆర్టీసీ బస్సు కండక్టర్ శ్రీధర్ రెడ్డికి అందజేశారు. దీంతో సంగారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ ఉపేందర్ సమక్షంలో సంబంధిత ప్రయాణికులు వసుధ, ప్రకాశ్ దంపతులకి ఆ పర్సును అందజేశారు. ఆ పర్సులో రూ.49.29 లక్షల విలువ గల 39 తులాల బంగారం బిస్కెట్లు ఉన్నాయి. నిజాయితీగా మానవత్వాన్ని చాటిన దుర్గయ్యని డిపో మేనేజర్ ఉపేందర్ సన్మానించారు. అలాగే వసుధ, ప్రకాశ్ దంపతులు దుర్గయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.