calender_icon.png 24 January, 2026 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు

24-01-2026 12:00:00 AM

భైంసా, జనవరి ౨౩ (విజయక్రాంతి) : బాసర సరస్వతి మాత ఆలయంలో క్యూలై న్లో నిలబడ్డ మంచిర్యాలకు చెందిన తిరుపతి ఐలయ్య అనే భక్తుడు కుప్పకూలిపోవడంతో పోలీసులు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడు. తిరుపతి ఐలయ్య కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నందుకు శుక్రవారం బాసరకు వచ్చారు. క్యూలైన్లో ఉన్న ఆయన ఒక్కసారిగా ఛాతి నొప్పి అం టూ కిందపడి స్పృహ కోల్పోయారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ ఇంద్రకరణ్ రెడ్డి కానిస్టేబుల్ గణేష్ నారాయణ తిరుపతయ్యకు సిపిఆర్ చేసి వెంటనే అంబులెన్స్‌లో స్థానిక పీహెచ్‌సీకి తరలించారు భక్తుని ప్రా ణాలు కాపాడిన పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.