24-01-2026 12:00:00 AM
ఏరియా జనరల్ మేనేజర్ రామచందర్
మణుగూరు, జనవరి 23, (విజయక్రాంతి) : విద్యార్థులు పట్టుదలతో చదివి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ అన్నారు. పి. వి. కాలనీ లోని సింగరేణి హైస్కూల్‌లో సుమారు రూ.13 లక్షల వ్యయంతో ఆధునికరించిన భోజనశాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణి పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు, విద్యాభివృద్ధికి యాజమాన్యం కృషి చేస్తుందని అభినందించారు.
కార్యక్రమంలో ఎస్ ఓటు జీఎం శ్రీనివాస చారి, డిజిఎం (పర్సనల్) ఎస్. రమేష్ , డిజిఎం (సివిల్) శివ ప్రసాద్, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ వై. రాంగోపాల్, ఐఎన్ టియూసి వైస్ ప్రెసిడెం ట్ వి. కృష్ణం రాజు , క్వాలిటీ విభాగం హెచ్‌ఓడి నాగరమేష్, ఏరియా సర్వే అధి కారి ఎల్. దయాకర్, సీనియర్ ఎస్టేట్స్ అధికారి శ్రీమతి స్వప్న , ఫైనాన్స్ మేనేజర్ రమేశ్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ డి.వి.ఎస్.ఎన్. ప్రవీణ్, పాఠశాల జీఎం ఆర్. కల్యాణి, ఉపాధ్యాయ బృందం, విద్యార్ధులు పాల్గొన్నారు.