30-08-2025 12:17:07 AM
మానకొండూర్, ఆగస్ట్29(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ రెండో సోదరుడు రాజేశం దశ దిన కర్మకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు, జిల్లాస్థాయి అధికారులు,పోలీసు అధికారులు హాజరయ్యారు.
రాష్ట్ర బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మాజీ ఎమ్మెల్యేలు మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎమ్మెల్సీ ధర్పల్లి రాజేశ్వరరావు తదితరులు రాజేశం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అలాగే రాజేశం కు నివాళులు అర్పించిన వారిలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిరిసిల్ల రాజన్న జిల్లా కలెక్టర్ సంజీవ్ కుమార్ ఝా, సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ భగవతి గీతే, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్లు ప్రపుల్ కుమార్, లక్ష్మీ కిరణ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మెన్నేని రోహిత్ రావు, ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య,స్టేట్ హౌసింగ్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సుడా మాజీ చైర్మన్ జీవీ రామకృష్ణారావు, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధిపతి ఊట్కూరి నరేందర్ రెడ్డి, తదితరులుఉన్నారు.