calender_icon.png 13 September, 2024 | 12:05 AM

ఎన్నికల వరకే రాజకీయాలు

04-07-2024 03:12:08 AM

  • అభివృద్ధికి అంతా కలిసి పనిచేయాలి 
  • రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం

కరీంనగర్, జూలై 3(విజయక్రాంతి): ఎన్నికల వరకే రాజకీయాలని, అభివృద్ధి కోసం అంతా కలిసి పనిచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హుస్నాబాద్ నియోజక వర్గం చిగురుమామిడి ఎంపీపీ, ఎంపీటీసీలు ఐదు సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం సమావేశ మందిరంలో ఆత్మీయ సన్మాన మహోత్సవం ఏర్పాటు చేశారు. పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యాలయం ఎదుట జాతీయ చిహ్నం స్థూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎంపీపీ కొత్త వినీతారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.

చిగురుమామిడి మండలంలో ప్రభుత్వ సహకారంతో సేవ చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర మంత్రిగా తాను ఉన్నానని, ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే రాజకీయాలకతీతంగా పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గీకురు రవీందర్, వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, ఎంపీడీవో మధుసూదన్, ఎంఆర్‌వో నరేందర్ పాల్గొన్నారు. కాగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోనూ పదవీకాలం పూర్తి చేసుకున్న సభ్యులకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, వైస్ ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.