calender_icon.png 6 December, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నయన గుహల సమీపంలో రాతి చిత్రాలు

06-12-2025 12:00:00 AM

రాష్ట్రంలో వంద దాటుతున్న రాతి చిత్రాలు

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): అడివిసోమనపల్లి పక్కన మానేరు ఒడ్డున ఉన్న నయనగుహలకు సమీపంలో సముద్రమట్టానికి 836 మీ.ల ఎత్తున ఉన్న చిత్రిత శిలాశ్రయం ఎంతో ప్రత్యేకమైనది. దట్టమైన అడివిలో ఉన్నది. ఈ రాతిచిత్రాలతావును అడ్లకొండ రాజేశ్ అనే యూట్యూ బర్ గుర్తించాడు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకుడు చొల్లేటి శ్రీనివాస్ ఈ తావున ఉన్న రాతిచిత్రాలను పరిశీలించాడు. చిన్న కొండపై ఉన్న చిన్న రాతి చిత్రాలతావులో మెసోలిథిక్, నియోలిథిక్, మెగాలిథిక్, చారిత్రక కాలాలకు చెందిన రాతిచిత్రాలు (రాక్ ఆర్ట్) ఉన్నాయి.

సంఖ్యాపరంగా తక్కు వే అయినా తెలంగాణలో రాక్ ఆర్ట్ దృక్కోణంలో ఇవి చాలా ముఖ్యమైనవని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సలహాదారులు, రాతిచిత్రాల నిపుణులు డా.బండి మురళీధర్‌రెడ్డి, కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ అభిప్రాయపడ్డారు. ఈ గీతలు ఎరుపు, తెలుపు, నలుపు, పసుపు రంగులతో గీయబడ్డాయి. గీతల్లో చేతి ముద్రలు, నిలబడి ఉన్న, కూర్చున్న మానవ ఆకృతులు, జింక, ఎద్దు, ఏనుగు, తేనెపట్టు, డైమండ్ ఆకారపు పెట్టె లు, విల్లంబు పట్టుకున్న మానవాకృతి పైన బాణం, మాల ఆకారం, ‘వి’ ఆకారం, త్రిశూ లం, వృత్తాలు, ఇతర ప్యానల్ డిజైన్లు, కొన్ని జంతు ఆకృతులు ఉన్నాయి. ఎర్ర రంగు లో బ్రాహ్మీ శాసనం యొక్క ఆనవాళ్లు కనిపిస్తాయి. కొన్ని గీతలు ఒకదానిపై ఒకటి అధ్యారోపణం చెంది ఉన్నాయి.

మరికొన్ని అతివ్యాప్తి చెందాయి. రాతి చిత్రాలతావు పరిసరాల్లో కొన్ని మైక్రోలిథ్లు, కొన్ని రంగు రాళ్ళు దొరికాయి. ఈ చిత్రిత శిలాశ్రయంలోని కొన్ని ఆకృతులు తెలంగాణలోని ఒం టిగుండు, సీతమ్మలొద్ది, గుండ్లపోచంపల్లి, రత్నాపూర్ రాతిచిత్రాలతావులలోని బొ మ్మలతో పోల్చదగినవి. క్షేత్రపరిశోధన చేసి న వారిలో చొల్లేటి శ్రీనివాస్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు, యూట్యూ బర్ అడ్లకొండ రాజేశ్, గైడ్ నారాయణ ఉన్నారు.