calender_icon.png 26 August, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనంనెత్తిన కాలుష్య కుంపటి?

26-08-2025 12:57:01 AM

* భద్రాద్రి థర్మల్ నుంచి గోదావరిలోకి బూడిద 

* కాలుష్య నివారణ పట్టించుకోని అధికారులు

* ప్రజారోగ్యం పైన పట్టింపేది?

* ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్రజలు

మణుగూరు, ఆగస్టు 25 (విజయ క్రాంతి) : చిక్కుడుగుంట గ్రామం వద్ద ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం నుంచి బూడిద వ్యర్థాలు గళగల లతో నేరుగా గోదావరిలోకి ప్రవహిస్తున్నాయి.

విద్యుదుత్పత్తి తోపాటు, పర్యావరణకు పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన జెన్కో యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితో ఓవైపు వాయు కాలుష్యంతో పాటు, మరో వైపు గోదావరి జలాలు సైతం కలుషితం అవుతున్నాయి. తద్వారా ప్రజలు అనారోగ్య పాలైరోగాల బారిన పడుతున్నా రని, ప్రజా ఆరోగ్యాల కు ప్రమాదం పొంచి ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జల,వాయు, బూడిద వ్యర్థాలు ప్రజల నెత్తిన కాలుష్య కుంపటి నింపుతోంది. పవర్ ప్లాంట్ గ్రామాల  ప్రజల ఇబ్బందులఫై విజయ క్రాంతి కథనం ..

కాలుష్యం కని పించట్లేదా..?

రాష్ట్రానికే వెలుగునిచ్చే కేంద్రంగా బీటీపీఎస్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అధికారరుల అలసత్వం ప్రస్తుతం ఆ ప్లాంటు ప్రతిష్టను మసక బారేలా చేస్తున్నాయి. ప్రజలప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేశాయి. అధికారుల పర్యవేక్ష ణ లోపంతో వెలుగునిచ్చే కేంద్రం కాస్త బూడిద. కాలుష్యం వెదజల్లే కేంద్రంగా మారి పోయింది.

పవర్ ప్రాజెక్టు నుంచి ని త్యం వెలువడే బూడిద (యాష్) తో తీవ్ర మైన కాలుష్యం వెదజల్లు తోంది. ఈ క్రమం లో యాష్ ప్లాంటు ద్వారా వచ్చే బూడిద పైకి గాలిలో ఎగిసిపడుతోంది. ప్లాంటు సమీపంలో గ్రామాలలో ప్రజలకు, రోడ్డు వెంట వెళ్లే వాహన దారులకుకాలుష్యం ప్రాణ సం కటంగా మారింది. అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడంతో సమీప గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతు న్నారు. దీనికి తోడు బూడిద తరలింపు అంశం కాలుష్యానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. 

వ్యర్థాలతో పర్యావరణ ముప్పు..

బీటీ పీఎస్ కి రెండు బూడిద చెరువులు ఉండగా, కొన్నేళ్ల క్రితం ఈ చెరువులో బూడిద నిండి పోవడంతో బూడిద చెరువు ల్లో నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కొన్ని దశ ల్లో కరకట్టల ఎత్తు పెంచారు. దీంతో బూడిద నిల్వ పెరిగింది. యాస్ ప్లాంట్ నిర్మాణం ఓపెన్ ప్రదేశంలో ఎత్తు భాగంలో ఏర్పాటు చేయడంతో గాలికి అందులో ఉన్న బొగ్గుయాస్ నుంచి దుమ్ము, ధూళీ కణాలు గ్రామాల పైకి విరాజిమ్మితున్నాయి. దీని ద్వారా పరిసర ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది.

గోదారంతా గరళమే..!

ప్రతి రోజు బీటీపీఎస్ నుంచి 6 వేల టన్నుల బూడిద వ్యర్థాలు వెలువడు తున్నా యి. వీటిలో 500 టన్నుల బూడిదను లారీ ల ద్వారా వివిధ అవసరాలకు బయటకు పంపిస్తున్నారు. మిగిలిన 5 500 టన్నుల బూడిద వ్యర్థాలను నిలువ చేసేందుకు రెండో యాష్ పాండ్ పూర్తికాని కారణంగా వాగులోకి పంపిస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా గోదావరిలో కలిపేస్తున్నారు.తద్వా రా స్వచ్ఛమైన గోదావరి జలాలు కలుషితం కాగా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఈ నీటినే తాగు, సాగునీటి అవసరాలకుఉపయోగిస్తున్నారు. నీరు కలుషితం అవుతుం డడంతో తాగుతున్న ప్రజలు,అనారోగ్యాల భారిన పడుతున్నారు.

పర్యావరణంపై పట్టింపేది..?

యూనిట్ లలో సైలోస్ ఏర్పాటు చేయకుండానే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని, వచ్చే బూడిదను కింద పోసి లోడింగ్ చేసి లారీల ద్వారా తరలించడం వల్లే ప్లాంట్ ఏరియాతో పాటు చుట్టు పక్కల గ్రామాలపై పెద్ద ఎత్తున బూడిద కమ్మే స్తుందని, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైపుల ద్వారా పంపే బూ డిద ప్లాంట్లో కొన్ని పరికరాలు సరిగ్గా పనిచేయక పోవడం వల్ల కూడా బూడిద పెద్ద ఎత్తున బయటకు వచ్చేస్తుందనే ఆరోపణలున్నాయి.

ప్లాంట్ యాజమాన్యం సమీప గ్రా మాలలో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వినిపిస్తుంన్నాయి. రోడ్డుకు ఇరు వైపులా మొక్కలు నాటాల్సిఉండగా, ఆ ఊసే కనిపిం చదు. యాష్ ప్లాం టు నిర్మాణం చేసిన చోట లక్షలాది మొక్కలునాటాల్సి ఉండగా.. వాటిని నాట లేదని, పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్యా లను సై తం పట్టించు కోలేదనే విమర్శలు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణకు కేటాయించిన ఫండ్ ఏమైనట్లని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఎన్వీరాల్ మెంట్ ఫండ్ ద్వార కోట్లతో కాలుష్య బాధిత గ్రామాల్లో ఉచిత మెడికల్ క్యాం పులు పెట్టి ప్రజలకు, పశువులకు వైద్య సేవలతో పాటు ఉచితంగా మందులు సరఫరా చేయాల్సి ఉంది. ఇలా నెల నెలా జరగాల్సి ఉన్నా ఎక్కడా అలా పెట్టిన దాఖలు లేవు. మరి నిధులు ఏమైనట్లు అనే ప్రశ్న ఉత్పన్న మవుతోంది. ఎక్కడా ఒక్క మొక్క పెట్టినట్లు గానీ, వాటికి ట్రీ గార్డులు పెట్టిన గానీ దాఖ లు లేవు.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీ నరీ కింద అడిగితే సమీప రిజర్వు ఫారెస్టును చూ పించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారనే అపవాదు ఉంది. ఇప్పటికైనా యా జమాన్యం స్పందించి పరిసర గ్రామాలలో కాలు ష్య నివారణ కోసం చర్యలు చేపట్టాలని ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.ఈ విషయమై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ రవీందర్ ను వివరణ కోరగా ఫిర్యాదులు వస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నటమే ముద్దుగుంది పో.