calender_icon.png 18 May, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ నిరంతరం

17-05-2025 08:42:32 PM

మాజీ వార్డ్ కౌన్సిలర్ కోయల్కర్ కన్నయ్యా..

కామారెడ్డి (విజయక్రాంతి): అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని మాజీ కౌన్సిలర్, వార్డ్ ఇంచార్జ్ కోయల్కర్ కన్నయ్య అన్నారు. శనివారం కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వారికి మార్కౌట్ ఇచ్చి మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. 60 గజాల ఓపెన్ ప్లాట్ లో ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కృషి వలన కామారెడ్డి పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు తెలిపారు. షబ్బీర్ అలికి కాలనీ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.