17-09-2025 05:52:05 PM
మందమర్రి,(విజయక్రాంతి): విశ్వకర్మ జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్టేషన్లో గల వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో బుధవారం విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ... కులమత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండగ విశ్వకర్మ జయంతి అన్నారు. సెప్టెంబర్ 17వ తేదీన దేవ శిల్పి విశ్వకర్మ జన్మించిన రోజు అని, ఈ పవిత్రమైన రోజునే కన్య సంక్రాంతి ఉంటుందని, విశ్వకర్మ పూజతో పాటు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగు తాయన్నారు. విశ్వ కర్మ సూర్య కిరణాలకు రూపం ఇచ్చాడని, అందుకే ఆయనను పౌరాణిక కాలపు ఇంజనీర్ అని పిలుస్తా రని అన్నారు.