calender_icon.png 12 September, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫొటోల అశ్లీలతపై ఐశ్వర్య ఆందోళన

11-09-2025 12:00:00 AM

ఏఐ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సెలబ్రిటీలకు తలనొప్పిగా మారాయి. ఈ విషయమై నటి ఐశ్వర్యరాయ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరును, ఫొటోలను అనుమతి లేకుండా ఉపయోగిం చేందుకు వీలు లేకుండా ఆదేశాలివ్వాలని ఆమె కోరారు.

వ్యక్తులు కానీ, సంస్థలు కానీ ఐశ్వర్య పేరు, ఫొటోలు ఉపయో గించకుండా తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయ స్థానం తెలిపింది. ఐశ్వర్య భర్త అభిషేక్ బచ్చన్ కూడా బుధవారం తన పబ్లిసిటీ, పర్సనాలిటీ హక్కులకు రక్షణ కల్పించాలంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. అభిషేక్ ఫొటోలను ఏఐతో క్రియేట్ చేసి అశ్లీల కంటెంట్‌కు ఉపయోగిస్తున్నట్టు పూర్తి ఆధారాలను కోర్టుకు సమర్పించినట్టు నటుడి తరఫున న్యాయవాది ప్రవీణ్ తెలిపారు.