17-10-2025 12:12:34 AM
పార్టీలో కొనసాగిన వారికి ప్రాధాన్యత సన్నాహక సభలో షబ్బీర్ అలీ
పర్యటన తర్వాత పదవుల ఖరారు కోసం నివేదిక సమర్పిస్తాం
కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు రిజ్వాన్ హర్షద్
నిజామాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : నిజామాబాద్ అర్బన్, నగర కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల భాగంగా బ్లాక్ ఏ, బి బ్లాక్ ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం సమావేశం నిర్వహించారు. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. పార్టీ కోసం శ్రమించి కష్టపడి విధేయతగా ఉన్నవారికి ప్రాధాన్యత ఇందులో భాగంగానే నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఎన్నిక కోసం నిజామాబాదు అర్బన్ నియోజకవర్గ విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిజామాబాద్ పట్టణంలోని హరిత హోటల్ లో నిర్వహించారు.
ఏఐసిసి అబ్జర్వర్ రిజ్వాన్ అర్షద్ గారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ , నిజామాబాద్ పట్టణ ఇంచార్జ్ ఎమ్మెల్సీ వెంకట్ బాల్మూర్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, రవి బాబు, పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా అనుబంధ సంఘా అధ్యక్షులుతో డివిజన్ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ల తోసమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలని సేకరించారు.
అధ్యక్ష పదవి ఆశించే వారి ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని 14 సంవత్సరాలుగా ఎలాంటి ప్రలోభాలకు బెదిరింపులకు భయపడకుండా ముందుకు నడిపించిన కేశ వేణు గారికి అభినందనలు తెలిపారు.
సంఘటన్ సృజన్ అభియాన్ దేశవ్యాప్త కార్యక్రమం ఇది పార్టీని పటిష్టం చేయడానికి పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించి వారికి పదవులు ఇవ్వడానికి కార్యక్రమాన్ని చేపట్టినట్టు సభ్యురాలు తెలిపారుదేశవ్యాప్తంగా యువత, మహిళలు, అణగారిన వర్గాల గొంతుక వినిపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందినీ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ప్రజల కోసం పోరాడుతుంది సభ్యులకు స్పష్టం చేశారు.
ఏఐసిసి అబ్జర్వర్ రిజ్వాన్ ఆర్షద్ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతం కులం, మతం సంబంధం లేకుండా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని అందరినీ కలుపుకు పోతుందన్నారు.బిజెపి ప్రభుత్వంలో కులమతాలను రెచ్చగొడుతూ ఒక నాలుగు కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతుందిఆధాని అంబానీల చేతిలో ప్రభుత్వం నడిపించే రిమోట్ ఉంటుంది. రాబోయే రోజుల్లో కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తోందని పేద ప్రజలకు కావలసిన పథకాలు అందిస్తుందన్నారు.
పార్టీని అట్టడుగు స్థాయి నుండి పునర్ నిర్మిస్తున్నాం..
పట్టణం మరియు జిల్లాలోని ప్రతి నియోజకవర్గము తాలూకా, మునిసిపాలిటీ మరియు మునిసిపల్ వార్డులను సందర్శించి, అట్టడుగు స్థాయి కార్యకర్తలతో సంప్రదించి, కొత్త స్థానిక నాయకులను నియమిస్తారు. యువకులు, విద్యావంతులు మరియు సైద్ధాంతిక నిబద్ధత కలిగిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని తీసు కూని పర్యటన తర్వాత, నియామకాలను ఖరారు చేయడానికి జాతీయ రాష్ట్ర నాయకత్వానికి నివేదికలు అందజేస్తామన్నారు.