25-09-2025 12:20:10 AM
సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి మల్లేష్
బోధన్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి) : ప్రత్యక్షంగా పరోక్షంగా శ్రామిక వర్గాన్ని దోపిడీ చేస్తున్న నేటి పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మూలన ద్వారానే దేశంలో కులాల నిర్మూలన జరుగుతుందని సి.పి.ఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి.మల్లేష్ అన్నారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) కుల నిర్మూలన లక్ష్యంగా సెప్టెంబరు 24 నుండి సెప్టెంబర్ 30 వరకు ఆచరణాత్మక కార్యక్రమాన్ని చేపట్టి సభలు,
సమావేశాలు జరపాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా బోధన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని రాకాసిపేట్ లో కుల నిర్మూలన ప్రచార సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ దేశంలో పేద ప్రజలను, శ్రామికులను శ్రమ దోపిడీ చేస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మూలనతోనే కులాల నిర్మూలన జరుగుతుందన్నారు.
కుల నిర్మూలన ఆచరణాత్మక కార్యక్రమాలను గొప్ప విప్లవ లక్ష్యంతో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ నాయకులు సీతారాం, బీపాషా బేగం, టి.లాలయ్య, అంజాద్, ఇంద్ర, సంధ్య, సరూప, సవిత, రేణుక,నాగమణి, మంజుల, సుగుణ, రమా, కళావతి, జ్యోతి, సౌజన్య, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.